ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) ఇష్మార్ట్ శంకర్ సినిమా( ISmart Shankar )తో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా మాస్ హీరోగా కొత్తగా అవతరించాడు.మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఈ సినిమాతో ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుని భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ఇద్దరు చేసిన సినిమాలతో ప్లాప్ అందుకున్నారు.

రామ్ ది వారియర్ సినిమాతో, పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) లైగర్ సినిమాతో ప్లాప్స్ ను అందుకోవడంతో ఈ జోడీ ఇప్పుడు మరోసారి కలిసి పని చేస్తుంది.నాలుగేళ్ళ తర్వాత వీరి కాంబోలో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోందని ఇటీవలే అఫిషియల్ గా ప్రకటించారు.ఇక కొద్దీ రోజుల క్రితమే గ్రాండ్ గా లాంచ్ చేసి షూట్ కూడా స్టార్ట్ చేయగా ఇప్పుడు మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసారు.

పూరీ టేకింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూట్ జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.జులై 13న స్టార్ట్ అయిన షెడ్యూల్ లో యాక్షన్ ప్యాక్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశామని మరో క్రేజీ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్ళాలి అని ఛార్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్ ఇచ్చారు.
కాగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ కానుండగా ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక రామ్ పోతినేని వారియర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో స్కంద సినిమా చేస్తుండగా సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
దీంతో మరో మాస్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.







