తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు ఏర్పరచుకున్నారు రజినీకాంత్.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు రజినీకాంత్.ఇది ఇలా ఉంటే రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్( Jailer movie ) ఆగస్టు 10న ఈ మూవీ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుండడంతో ప్రస్తుతం మూవీ మేకర్స్ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన తలైవ తన జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒక విషయంలో పశ్చాత్తాప పడ్డారు.నా జీవితంలో మద్యం అనేది లేకపోయింటే ఈ పాటికి నేను సమాజసేవ చేస్తుండేవాడిని.
మందు తాగడం జీవితంలో నేను చేసిన అతిపెద‍్ద తప్పు.నువ్వు రాజువి మందు తాగొద్దు అని నా తమ్ముడు అప్పటికీ చెబుతుండేవాడు.
కానీ నేనే వినలేదు.ఒకవేళ నా లైఫ్‌లో ఆల్కహాల్ ( Alcohol )అనేది లేకపోయింటే.
ఇప్పుడున్న దానికంటే ఎంతో గొప్పస్థాయిలో ఉండేవాడిని, వ్యక్తిగతంగా కూడా మీ వల్ల వాళ్లకు ఇబ్బంది.అయితే నేను పూర్తిగా మందు తాగొద్దు అని చెప్పడం లేదు.
మీకు సరదాగా అనిపించినప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగండి.కానీ రోజూ మాత్రం డ్రింక్ చేయవద్దు.

ఎందుకంటే అది మీ ఆరోగ్యంతో పాటు మీ చుట్టూ వాళ్ల ఆనందాన్ని నాశనం చేస్తుంది.ఒకవేళ మీరు తాగితే మాత్రం మొత‍్తం జీవితం తలకిందులైపోతుంది.మీ తల్లిదండ్రులు, కుటుంబం, అందరూ మీ తాగుడు వల్ల ఇబ్బంది పడతారు.అందుకే మందు తాగొద్దు అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.ఈ సందర్బంగా రజనీకాంత్ చేసిన వాఖ్య లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.రజినీకాంత్ ఈ విధంగా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఇలా తాను చేసిన తప్పుకి పశ్చాతాపం పడుతున్నారు.







