ఈ ఏడాది అత్యంత తక్కువ సమయంలో షూటింగ్ ను పూర్తి చేసుకుని భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏదనే ప్రశ్నకు బ్రో సినిమా( Bro movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు పరవాలేదనే స్థాయిలో ఉన్నా సోమవారం బుకింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి.
హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో సైతం ఈ సినిమాకు 50 శాతం ఆక్యుపెన్సీ లేకపోవడం గమనార్హం.

బ్రో మూవీ నాలుగో రోజు బుకింగ్స్ అవాక్కయ్యేలా ఉన్నాయి.బుక్ మై షో వెబ్ సైట్ లో అన్ని థియేటర్లలో ఈ సినిమాకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.ఈ సినిమా కలెక్షన్లు ఈరోజు నుంచి భారీ స్థాయిలో డ్రాప్ కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బ్రో మూవీ కలెక్షన్లు రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రీమేక్ సినిమాలలో నటించడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బ్రో సినిమాకు సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.బ్రో సినిమాలో ఇచ్చిన సందేశం సైతం మరీ అద్భుతంగా లేదు.కాలం అనుకున్న విధంగానే మన జీవితంలో జరుగుతుందంటే కష్టపడిన వాళ్లకు కష్టపడని వాళ్లకు తేడా ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.బ్రో మూవీలో కమర్షియల్ అంశాలు ఎక్కువగానే ఉన్నాయని సమాచారం.
బ్రో సినిమా ఆశించిన రిజల్ట్ ను అందుకోకపోవడంతో సముద్రఖనికి ( Samuthirakani )తెలుగులో ఆఫర్లు రావడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బ్రో తరహా సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలంటే కథ, కథనం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాలు భారీగా కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







