వీడియో వైరల్: వీడియో గేమ్ తెగ ఆడేస్తున్న శునకం.. ఒక్కసారి గేమ్ ఆడుతున్న కంప్యూటర్ ఆఫ్ చేయగానే..?!

సెల్‌ఫోన్, కంప్యూటర్ మనుషులే కాదు.తాను కూడా ఉపయోగిస్తానంటోంది ఈ కుక్క.

 Video Viral A Dog Playing A Video Game Tribe Once The Computer Playing The Game-TeluguStop.com

పెద్దలే కాకుండా చిన్నపిల్లలు కూడా ఇటీవల సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు.చిన్న వయస్సులోనే ఫోన్స్‌కు బానిసలవుతున్నారు.

ఫోన్లు, ఐపాడ్స్‌లలో వీడియో గేమ్స్ ఆడుతూ సమయం గడుపుతున్నారు.అయితే మనుషులే కాదని, తాను కూడా వీడియో గేమ్స్ ఆడుతానంటోంది ఓ శునకం.

దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Dog, Game-Latest News - Telugu

మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్ట్రబ్ చేస్తే మనకు చిరాకుగా ఉంటుంది.ఏదైనా సీరియస్ పని చేస్తున్నప్పుడు ఎవరైనా కదిలిస్తే ఇరిటేషన్ వస్తుంది.ఇప్పుడు వీడియో గేమ్ ఆడుతున్న ఒక కుక్కకు కూడా కోపం వచ్చింది.

శునకం వీడియో గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా కంప్యూటర్ ఆగిపోయింది.దీంతో శునకం కోపంతో కీబోర్డ్‌ను తోసేసింది.

కోపం, నిరాశను మొఖంలో ప్రదర్శించింది.యానిమల్ హౌస్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దీనిని షేర్ చేశారు.

ముగింపు కోసం వేచి ఉండండి అనేక క్యాప్షన్ షేర్ చేస్తూ దీనికి ఇచ్చారు.

Telugu Dog, Game-Latest News - Telugu

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఈ వీడియోలో కంప్యూటర్ కీబోర్డ్ నొక్కుతూ శునకం వీడియో గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది.శునకం గేమ్ ఆడుకుంటుండగా యజమాని ఒక్కసారిగా కంప్యూటర్ ఆఫ్ చేశాడు.

దీంతో శునకం మొహంలో కోపం, నిరాశ కనిపించగా.కీబోర్డును పక్కకు తోసేసింది.

మనుషుల్లాగే శునకాలు కూడా భావోద్వేగాలు ప్రదర్శిస్తూ ఉంటాయి.ఈ శునకం కూడా మనుషుల్లాగే భావోద్వేగాలను బయటపెట్టింది.

ఈ వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ రాగా.శునకానికి బాగా కోపం వచ్చినట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

దానిని ఎందుకు డిస్ట్రబ్ చేశారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.వీడియో చాలా పన్నీగా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

చాలామంది రకరకాల ఎమోజీలతో కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube