నాగ చైతన్య ( Naga chaithanya ) చూడడానికి ఎంతో సైలెంట్ గా కనిపిస్తూ ఉంటారు.కానీ ఈ విషయం తెలిస్తే నాగచైతన్య చాలా రొమాంటిక్ ఫెలో అంటారు.
ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి ఎంతో మంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపించారట.అవును నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు హీరో హీరోయిన్ల మధ్య ఏ చిన్న వార్త చెక్కర్లు కొట్టిన కూడా దాని గురించి ఇంకా ఎన్నో వార్తలు అల్లేస్తూ ఉంటారు.
అలా ఇప్పటివరకు నాగచైతన్యకు ఎంత మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలు వినిపించాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఏమాయ చేసావే సినిమా టైంలో సమంత ( Samantha ) తో పీకల్లోతు ప్రేమలో పడి చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.
ఇక సమంత మాత్రమే కాకుండా నాగ చైతన్య లవ్ ట్రాక్ నడిపిన హీరోయిన్లు ఎంతమంది అంటే.ప్రేమమ్ సినిమాలో నటించే టైంలో శృతిహాసన్ ( Sruthi haasan ) తో నాగచైతన్య కు ఎఫైర్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి.
కానీ ఈ విషయంపై వీళ్ళిద్దరూ స్పందించలేదు.అంతేకాకుండా దడ సినిమాలో నటించే టైంలో కాజల్ అగర్వాల్ ( Kajal agarwal ) నాగచైతన్య కి మధ్య ఎన్నో వార్తలు వినిపించేసరికి వీరిద్దరి మధ్య కూడా నిజంగానే ఎఫైర్ ఉంది అని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి.
అలాగే మజిలీ సినిమాలో చేస్తున్న టైంలో సమంత తో పాటు మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ ( Divyansha kaushik ) తో చైతుకు ఎఫైర్ వార్తలు వచ్చాయి.

అంతేకాదు ఈ హీరోయిన్ వల్లే సమంతకి నాగచైతన్యకి మధ్య గొడవలు కూడా వచ్చాయని గతంలో ఒక టాక్ వినిపించింది.ఇక సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్నాక ఈ మధ్య కాలంలో ఎక్కువగా శోభిత ధూళిపాల ( Shobitha dulipala ) తో నాగచైతన్య పేరు వినిపిస్తుంది.అంతేకాకుండా వీరి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడ్డా కూడా అందులో ఎలాంటి నిజం లేదు అని ఈ ఇద్దరు కొట్టి పారేస్తున్నారు.

అలాగే బంగార్రాజు సినిమా చేసే టైంలో కృతి శెట్టి ( Krithi shetty ) కి నాగ చైతన్యకి పెళ్లయింది అంటూ కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే థంబ్ నెయిల్స్ సృష్టించారు.ఇక బంగార్రాజు సినిమాలో చేస్తున్న టైంలో మరో హీరోయిన్ అయినా దక్షా నగార్కర్ ( Daksha nagarkar ) తో నాగచైతన్యకు ఎఫైర్ వార్తలు వినిపించాయి.ఎందుకంటే బంగార్రాజు సినిమా ఈవెంట్ లో నాగచైతన్య ( Naga chaithanya ) దక్షా ఇద్దరూ సైగలు చేసుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నిజంగానే వీరి మధ్య ఏదో ఉంది అనే టాక్ నడిచింది.కానీ రావణాసుర సినిమా ప్రమోషన్స్ లో దక్ష నగార్కర్ అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చింది.
ఇలా సైలెంట్ గా కనిపించే నాగచైతన్యకి ఇంతమంది హీరోయిన్ లతో ఎఫైర్ వార్తలు వినిపించాయి.







