జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వాలంటీర్ల వలన ప్రజల డేటా దుర్వినియోగం అవుతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
పవన్ ను రాష్ట్రంలో ఎవరూ గుర్తించడం లేదనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.వాలంటీర్ల వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన పవన్ గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.
ఈ క్రమంలో పవన్ కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని వెల్లడించారు.







