బీజేపీని వైసీపీ తక్కువగా అంచనా వేసిందా ?

ఏపీలో ప్రధాన పార్టీలు ఏవంటే టక్కున టీడీపీ, వైసీపీ ( YCP party )పార్టీలను చెబుతారు.ఇంకా జనసేన పార్టీని కూడా ప్రధాన పార్టీగానే గుర్తిస్తారు.

 Did Ycp Underestimate Bjp, Bjp Party, Brs Party, Ycp Party, Tdp Party, Daggubati-TeluguStop.com

కానీ బీజేపీని మాత్రం ప్రధాన పార్టీగా ఎవరు భావించారు.అయినప్పటికి బీజేపీ ఎప్పటి నుంచో ఏపీలో బలపడాలని ప్రధాన పార్టీగా ఎదగాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

కానీ పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీకి అనుకున్న స్థాయిలో హైప్ రావడం లేదనే చెప్పాలి.సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో పార్టీ నేతల్లో కూడా ఏ మాత్రం జోష్ కనిపించలేదు.

కానీ ఇటీవల ఆయన స్థానంలో పురందేశ్వరికి ఆ బాద్యతలు అప్పటించింది కాషాయ పార్టీ అధిష్టానం.

Telugu Ap, Bjp, Brs, Tdp, Ycp-Politics

ఇక పదవి చేపట్టినది మొదలు కొని పురందేశ్వరి( Daggubati Purandeswari ) దూకుడు ప్రదర్శిస్తోంది.నిత్యం ఏదో ఒక రకంగా పార్టీ పేరు ప్రజల్లో నానేలా చూసుకుంటుంది.ఈ మద్య పురందేశ్వరి వైసీపీ సర్కార్ ను గట్టిగానే టార్గెట్ చేసి ఘాటైన విమర్శలు గుప్పిస్తోంది.

జగన్ పాలన అత్యంత అవినీతిగా సాగుతోందని, జగన్ ఏపీని అప్పుల్లో ముంచెత్తుతున్నారని, ఇలా ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు పురందేశ్వరి.ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అవుతుండడంతో వైసీపీ నేతలు కూడ పురందేశ్వరి వ్యాఖ్యాలకు కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గతంలో సోము వీర్రాజు వైసీపీ పై జగన్( CM jagan ) పాలనపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ పెద్దగా స్పందించని వైసీపీ నేతలు పురందేశ్వరి వ్యాఖ్యలకు మాత్రం ఘాటుగా స్పందిస్తూన్నారు.

Telugu Ap, Bjp, Brs, Tdp, Ycp-Politics

అప్పుల గురించి ప్రస్తావిస్తున్న పురందేశ్వరి.విశాఖ స్టీల్ ప్లాన్ ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా వంటి అంశాలపై కూడ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా మొదటి నుంచి కూడ వైసీపీ మరియు బీజేపీ మద్య అంతర్గత పొత్తు ఉందనే వార్తలు అడపా దడపా వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ ఆ మద్య బీజేపీ పెద్దలు జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం, జగన్ కూడ బీజేపీ తమతో లేదని చెప్పడంతో రెండు పార్టీల మద్య స్నేహబంధం చెడిందనే విషయం స్పష్టమైంది.మొత్తానికి గతంలో బీజేపీని తక్కువగా అంచనా వేసిన బీజేపీ కొత్తగా పార్టీ అధ్యక్షురాలిగా బాద్యతలు చేపట్టిన పురందేశ్వరి రాకతో బీజేపీని కూడ డిఫెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube