Kamal Haasan : జెంటిల్‌మేన్ మూవీని రిజెక్ట్ చేసిన కమల్ హాసన్.. అది బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో… 

సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ డైరెక్టర్లలో శంకర్( Shankar ) ఒకరు.అతను తన సినిమాలలో సామాజిక సమస్యలను చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.

 Who Rejected Gentlemen Movie-TeluguStop.com

అతను 1993, జులై 30న విడుదలైన తన మొదటి సినిమా “జెంటిల్ మేన్( Gentleman )”తో తన డైరక్టోరియల్ కెరీర్‌ను ప్రారంభించాడు.విద్యావ్యవస్థలోని లొసుగులను లక్ష్యంగా చేసుకున్న ఈ సినిమా ఒక విజయం.

ఈ సినిమాలో అర్జున్, మధుబాల, వినీత్, శుభశ్రీ, నంబియార్, మనోరమ, గౌండమణి, సెంథిల్, చరణ్ రాజ్, రాజన్ పి.దేవ్, అజయ్ రత్నం నటించారు.ఈ మూవీ తమిళనాడులో భారీ విజయం సాధించింది.అర్జున్‌ను టాప్ స్టార్‌గా నిలబెట్టింది.

Telugu Arjun, Gentlemen, Kamal Haasan, Kollywood, Shankar, Tollywood-Telugu Top

డైరెక్టర్ శంకర్ “జెంటిల్ మేన్” సినిమాను మొదట కమల్ హాసన్‌( Kamal Haasan )తో చేయాలనుకున్నాడు, కానీ అతను తిరస్కరించాడు.తరువాత రాజశేఖర్‌ను సంప్రదించాడు.కానీ అతను కూడా తిరస్కరించాడు.చివరికి అర్జున్ ఈ మూవీలో నటించడానికి అంగీకరించాడు.మీరు సినిమాని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏవో తెలియ రాలేదు.బహుశ వారు ఆ సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండి ఉండవచ్చు.

ఏది ఏమైనా జెంటిల్‌మేన్ సూపర్ హిట్ కావడంతో అతడికి ఓవర్ నైట్ స్టార్‌డం దక్కింది.దాంతో కమల్‌ హాసన్‌కి షాక్‌ తగిలినట్లు అయింది.

ఇక ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.ఈ సినిమా ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డులను గెలుచుకుంది.

Telugu Arjun, Gentlemen, Kamal Haasan, Kollywood, Shankar, Tollywood-Telugu Top

“జెంటిల్ మేన్” లోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా “చికుబుకు చికుబుకు రైలే“, “ముదినేపల్లీ” పాటలు చాలా పాపులారిటీని దక్కించుకుంది. చికుబుకు చికుబుకు రైలే పాట ఒక ట్రెండ్ సెట్టర్ అయింది.ఇప్పటికీ ప్రజల నోటల్లో నానూతోంది.జెంటిల్ మేన్ చిత్రం శంకర్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది అనడంలో సందేహం లేదు.ఈ సినిమా తర్వాత అతనికి చాలా మంచి గుర్తింపు దక్కి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube