మళ్లీ పెళ్లి( Malli Pelli ) సినిమా ద్వారా ఒక్కసారిగా సంచలనంగా మారారు నటుడు నరేష్.నటి పవిత్ర లోకేష్ ( Pavitra Lokesh ) తో రిలేషన్ లో ఉన్నటువంటి ఈయన ఏకంగా ఆమెతో కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా తనది నిజజీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా థియేటర్లో పెద్దగా మెప్పించలేకపోయిన డిజిటల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నరేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తాను తొమ్మిది సంవత్సరాల వయసులోనే బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.అప్పట్లోనే కృష్ణ,విజయనిర్మల, ఎస్వీ రంగారావు వంటి వారి గొప్ప నటులతో తాను నటించాలని తెలిపారుగా .ఇక బాలనటులుగా కొనసాగినటువంటివారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది స్థిరపడ్డారు.అలాంటి వారిలో తాను కూడా ఒకరని ఈయన తెలియజేశారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే తాను అకస్మాత్తుగా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి రాజకీయాలలో( Politics ) కి వెళ్లాను.ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు.
ఇక రాజకీయాలలో కొనసాగలేక తిరిగి సినిమాల్లోకి వచ్చాను ఆ సమయంలో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను.అలాంటి సమయంలో చాలామంది నన్ను చిన్నచూపు చూశారు.
కొందరు నాపై దుష్ప్రచారాలు కూడా చేశారు.ఆ క్షణమే తనకు తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అన్న విషయం చాలా బాగా అర్థమైందని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.
ఇక నేను చూసిన రాజకీయ జీవితం నన్ను ధైర్యంగా నిలబెట్టి ముందుకు నడిపేలా చేసిందని ఈ సందర్భంగా ఈయన చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







