ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెగా మల్టీస్టారర్ ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వినోదయ సీతం రీమేక్ అయినప్పటికీ ముందు నుండి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న బ్రో సినిమా జులై 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్’‘.

పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూసారు.మరి ఎట్టకేలకు రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.ఇక ఈ సినిమా అన్ని చోట్ల కలిసి 98 కోట్ల బిజినెస్ చేసుకుని 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.మొదటి రోజు అయితే భారీ ఓపెనింగ్స్ రాబట్టిందిhttps://telugustop.com/wp-content/uploads/2023/07/Vinodhaya-Sitham-Pawan-Kalyan-Sai-Dharam-Tej-Bro-Movie-BRO-Collections-tollywood.jpg.
ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ లభించిన కూడా డే 1 భారీ వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రం మొదటి రోజు సుమారు 34 కోట్ల మేర షేర్ అందుకున్నట్టు తెలిసింది.ఇక వరల్డ్ వైడ్ గా రెండవ రోజు ఈ సినిమా 20 కోట్లకి పైగానే షేర్ రాబట్టినట్టు టాక్ బయటకు వచ్చింది.
మొదటి రోజుతో పోల్చితే కలెక్షన్స్ తగ్గినప్పటికీ రెండవ రోజు 20 కోట్ల షేర్ అందుకున్న అతి తక్కువ సినిమాల్లో బ్రో( Bro movioe ) ఒకటిగా నిలిచి రికార్డ్ సెట్ చేసింది.ఇక ఈ ఫ్లో చూస్తుంటే ఈ మాస్ బాటింగ్ ఆదివారం రోజు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.
ఏది ఏమైనా బ్రో టాక్ కొద్దిగా మిశ్రమంగా వచ్చినప్పటికి పవర్ స్టార్ స్టామినాతో ఈ సినిమా ప్లాప్ అవకుండా అయితే కాపాడే అవకాశం ఉంది.మరి ఈ వీకెండ్ గడిస్తే కానీ కలెక్షన్స్ లెక్క తేలి హిట్టో ప్లాప్ నో తేలిపోనుంది.
చూడాలి పవర్ స్టార్ స్టామినా ఎంత మేర లాక్కొస్తుందో.







