అప్పుడప్పుడు సెలబ్రెటీలు సమాజంలో జరిగే విషయాలపై బాగా ఫైర్ అవుతూ ఉంటారు.మామూలుగా కొంతమంది జనాలు బయట ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరు.
కానీ కొంతమంది మాత్రం నిత్యం సమాజం కోసం పోరాటం చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటారు.అందులో ఒకరు యాంకర్ రష్మీ గౌతమ్( Rashmi Gautam ) అని చెప్పాలి.
జబర్దస్త్ ద్వారా యాంకర్ పరిచయమైన రష్మీ బుల్లితెరపై తనకంటూ ఒకక్రేజ్ సంపాదించుకుంది.ఇప్పటికీ జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతూనే ఉంది.
చూడటానికి అందంతో పాటు మంచి హైట్ కూడా ఉంటుంది.జబర్దస్త్ లో ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు.
అప్పట్లో కమెడియన్ సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి బాగా హడావిడి చేసింది.కానీ అదంతా రేటింగ్ కోసమే వారితో అలా మల్లెమాల నడిపించింది అని తెలిసింది.
ఇక కేవలం జబర్దస్త్ షోలో కాకుండా ఢీ డాన్స్ షో లో కూడా టీమ్ లీడర్ గా చేసింది.ఇక ఇందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకర్ గా చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.నిత్యం ఏదో ఒక విషయం గురించి చర్చ చేస్తూనే ఉంటుంది.పైగా ఈమె మూగజీవులు పట్ల బాగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది.వాటికి ఏమైనా అవుతే అస్సలు తట్టుకోలేదు.
ప్రతిరోజు వాటికి సంబంధించిన పోస్ట్లు షేర్ చేస్తూనే ఉంటుంది.ఎవరైనా మూగజీవులను హింసిస్తే అస్సలు ఊరుకోదు.
సమాజంలో జరిగే అన్యాయాల పట్ల కూడా బాగా ఫైర్ అవుతూ ఉంటుంది.

ఎవరైనా ఇతరులపై దురుసుగా ప్రవర్తించిన లేక సమాజంలో ఏదైనా సంఘటన జరిగిన అస్సలు ఊరుకోదు.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలు బాగా పంచుకుంటూ ఉంటుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా అందాలు చూపిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది.
గ్లామర్ లుక్ లోనే కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కూడా కన్నార్పకుండా చేస్తూ ఉంటుంది.

అలా సోషల్ మీడియా( Social media )లో కూడా ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను డేటింగ్ సంప్రదాయం గురించి కొన్ని బోల్డ్ కామెంట్లు చేసింది.తన సోషల్ మీడియాలో శృంగార డేటింగ్ పై బోల్డ్ పోస్ట్ పంచుకుంది.
అయితే ఈ మధ్యకాలంలో డేటింగ్ సాంప్రదాయం వల్ల మన మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నాయో అనే విషయాన్ని వివరించింది.

డేటింగ్ సాంప్రదాయం వల్ల ప్రస్తుతం జరుగుతున్నది ఇదే.సంబంధాలు వావి వరసలు గురించి ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కరిని అనుభవించడానికి బిజీ బిజీ అయిపోతున్నారు.దేవుడు నిజమైన ప్రేమను పొందండి అనే మార్గంలో పంపుతుంటే మీరేమో రాక్షసతమైన శృంగార కోరికలతో ప్రేమను తిరస్కరించేస్తున్నారు అని పంచుకుంది.
ప్రస్తుతం ఆమె పంచుకున్న బోల్డ్ ఫోటో బాగా వైరల్ గా మారింది.






