యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా రూపొందుతున్న సినిమాల జాబితా చాలా పెద్దగానే ఉంది.ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యం లో సలార్( Salaar ) మరియు కల్కి సినిమా లపై అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. బాహుబలి 2 సినిమా ( Baahubali 2 )తర్వాత ప్రభాస్ కి సక్సెస్ అనేది కరువయింది.
మూడు సినిమా లు వస్తే మూడు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దాంతో బాబోయ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నట్లుగా ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే ఇప్పటికే కమిట్ అయిన సినిమా లు మొదలుకుని ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన సినిమా లను కూడా పక్కన పెట్టాలని కేవలం సలార్, కల్కి సినిమా లపై పూర్తి దృష్టి పెట్టాలని భావిస్తున్నాడట.ఆ రెండు సినిమా లు కూడా రెండు పార్ట్ లు గా రాబోతున్నాయి అనే విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది.సలార్ రెండు భాగాలు అనేది కన్ఫర్మ్, కల్కి విషయం లో క్లారిటీ రావాల్సి ఉంది.ఈ రెండు సినిమాల పనులు మరో ఏడాది పాటు పట్టే అవకాశం ఉంది.
అందుకే ప్రభాస్ తన తదుపరి సినిమా మారుతి దర్శకత్వం లో చేయాలని భావించినప్పటికి కూడా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మొదలు పెట్టిన మారుతి సినిమా ను హోల్డ్ చేయడం జరిగిందట.సలార్, కల్కి సినిమా ల ఫలితాన్ని బట్టి మారుతి సినిమా ను ముగించే విషయమై ప్రభాస్ ఆలోచన గా తెలుస్తోంది.నిర్మాత ఇప్పటికే ప్రభాస్, మారుతి సినిమా పై చాలా ఖర్చు చేశాడు.
ఇలాంటి సమయంలో హోల్డ్ లో పెట్టడం వల్ల నిర్మాతకు భారీ నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.అప్పుడు ప్రభాస్ నిర్మాతకు ఎలా న్యాయం చేస్తాడో చూడాలి.మొత్తానికి ప్రభాస్, మారుతి కాంబో మూవీ కంటెంట్ ఎలా ఉంటుందో కానీ మేకింగ్ ఉందా లేదా అనేది పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది.ఇప్పటి వరకు ఈ సినిమా అధికారిక ప్రకటన రాలేదు.
అసలు సినిమా అనేది ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు.కనుక ఏ క్షణం లో ఏం జరుగుతుందో తెలియదు.







