తెలంగాణ( Telangana ) రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది.ఇప్పటికే లక్ష సాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని విడుదల చేసింది.
ఆ వివరాలు ఏంటో మనం చూసేద్దాం.ముస్లిం, క్రైస్తవ నిధుల నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
ఈ సందర్భంలోనే కమ్యూనిటీ కార్పొరేషన్ క్రైస్తవుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతోంది. దరఖాస్తుల ప్రారంభ తేదీ జూలై 31 నుంచి దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 14 వరకు ఉంటుందని ప్రభుత్వం తెలియజేసింది.
ఈ లక్ష సాయానికి దరఖాస్తు చేసుకోవాలిసిన అభ్యర్థులు www.tsobmms.gov.in పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.

అయితే ఈ పథకానికి 21ఏళ్ల నుంచి 55 ఏళ్ల వాళ్ళు మాత్రమే అర్హులని తెలియజేస్తోంది.అంతేకాకుండా దీనికి అప్లై చేసుకునే అభ్యర్థుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వ్యక్తులకైతే లక్షన్నరలోపు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి కైతే రెండు లక్షల లోపు ఉండాలని నిబంధనలు ఉన్నాయి.

అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందు( Bc Scheme ) పేరుతో కమ్మరి, కుమ్మరి,నాయి బ్రాహ్మణ,రజక, వడ్డెర, పూసల తదితర బీసీ కులాలకు లక్ష రూపాయల సాయం అందిస్తూ వస్తోంది.ఈ తరుణంలోని మైనార్టీల( Minorities ) కు కూడా అందించాలని సర్కార్ ఆలోచన చేసి ఈ పథకాన్ని అందిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ పథకంపై ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం క్రిస్టియన్ ( Cristian ) కార్పొరేషన్ కార్యాలయంలోని జిల్లా మైనార్టీ అధికారిని సంప్రదించాలని, లేదంటే 040-23391067 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు తెలియజేస్తున్నారు.ఈ పథకం ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో వెనుకబడిపోయినటువంటి చేతి వృత్తుల, కుల వృత్తుల కార్మికులకు చేయూతను అందించేందుకే తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ ( CmKcr ) తెలియజేస్తున్నారు.







