రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయినిపల్లి మండల గ్రామాల ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు.మండల కేంద్రంలో మహ్మద్ ఆజ్జూ మాట్లాడుతూ త్యాగనికి, సహనానికి మొహర్రం ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే పీర్ల ఊరేగింపు తెలంగాణ ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం ఇది అని,దేశానికే ఆదర్శంగా లౌకిక వాద స్ఫూర్తిని మొహర్రం నింపుతోందని అన్నారు.
మొహర్రం( Muharram ) స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదమని ఈ సందర్భముగా కోరారు.