రాజన్న సిరిసిల్ల జిల్లా: సర్వ మత సమ్మేళనం తెలంగాణ రాష్ట్రం అని డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి అన్నారు.శనివారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకొని పీరీలను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గసికంటి అరుణ్,బడుగు నరసయ్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.







