సిక్కులు( Sikhs ) తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.
తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.
విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.
అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో తమకు ప్రత్యేక గుర్తింపు కేటాయించాలని సిక్కులు ఆందోళనలు చేస్తున్నారు.ఈ క్రమంలో సిక్కులపై విద్వేష నేరాలు ఎక్కువవుతున్నాయి.ఇటీవలి కాలంలో పలు సంస్థలు విడుదల చేసిన నివేదికల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలో( America ) యూదుల తర్వాత అత్యధికంగా విద్వేష నేరాలకు గురయ్యేది సిక్కులేనట.
తాజాగా న్యూయార్క్( New York ) సాయుధ బలగాల్లో పనిచేస్తున్న సిక్కు పోలీస్ అధికారికి( Sikh Cop ) అతని పై అధికారులు గడ్డం పెంచుకోవడానికి అనుమతి నిరాకరించినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.న్యూయార్క్ స్టేట్ ట్రూపర్స్ పోలీస్ బెనివొలెంట్ అసోసియేషన్ ప్రకారం.ఆరేళ్లుగా స్టేట్ ట్రూపర్‌గా విధులు నిర్వర్తిస్తున్న చరణ్‌జోత్ తివానా( Charanjot Tiwana ) తన పెళ్లి కోసం గడ్డం పెంచుకోవాలనుకున్నాడు.
ఇందుకోసం అధికారులను అనుమతి కోరారు.అయితే భద్రతా కారణాలు, న్యూయార్క్ చట్టాల ప్రకాల తివానాకి అనుమతి నిరాకరించారు.
సిక్కు పురుషులు తలపాగా ధరించడంతో పాటు వారి మత విశ్వాసాల్లో భాగంగా జుట్టు, గడ్డాన్ని కత్తిరించరు.కానీ న్యూయార్క్ పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం.
సాయుధ బలగాల్లో పనిచేసేవారు జట్టును కత్తిరించుకోవడంతో పాటు క్లీన్ షేవ్‌తో వుండాలి.
జూలై 24న న్యూయార్క్ రాష్ట్ర పోలీస్ శాఖలో డ్రెస్ కోడ్‌లను ఉద్దేశించి సిక్కు కమ్యూనిటీ సభ్యులు మాట్లాడుతుండగా.న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు వెప్రిన్ .సామ్ వెర్‌స్టాండిగ్ అందించిన ఫోటోను వారికి చూపించారు.చట్టాన్ని అమలు చేసే అధికారులతో సహా న్యూయార్క్ వాసులంతా తమ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు యజమాని అణచివేత నుంచి విముక్తి పొందాలన్నారు.అయితే తివానా అభ్యర్ధనను తిరస్కరించడంపై వ్యాఖ్యానించేందుకు న్యూయార్క్ స్టేట్ పోలీస్ అధికార ప్రతినిధి నిరాకరించారు.