మెగా డాటర్ నిహారిక( Niharika ) తన వ్యక్తిగత కారణాలవల్ల గత కొంతకాలంగా సోషల్ మీడియా వార్తలో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఎప్పుడైతే ఈమె తన భర్తను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసి పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారో ఆ క్షణం నుంచి నిహారిక విడాకుల ( Divorce ) వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి.
ఇలా నిహారిక విడాకుల వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వినిపిస్తున్నటువంటి తరుణంలో ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందించి తాను చైతన్య నుంచి విడాకులు తీసుకున్నానని ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ విధంగా నిహారిక విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత పూర్తిగా తన దృష్టిని తన కెరియర్ పై పెట్టారు.ఈ క్రమంలోనే ఈమె పింక్ ఎలిఫెంట్ నిర్మాణ సంస్థను ప్రారంభించి వెబ్ సిరీస్ లను( Web series ) నిర్మిస్తూ పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా మారడానికి నిహారిక ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే తాజాగా కెరియర్ పరంగా నిహారిక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది.పెళ్లికి ముందు నిహారిక హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా హీరోయిన్ గా సక్సెస్ కానీ ఈమెకు అనంతరం పెళ్లి చేయడంతో నిర్మాతగా స్థిరపడ్డారు.అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తిరిగి హీరోయిన్ ( Heroine ) గా సినిమాలలో నటించాలని నిర్ణయం తీసుకున్నారట.ఇలా ఈమె తిరిగి హీరోయిన్ గా వెండి తెరపై సందడి చేయాలని నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు తన నిర్ణయాన్ని వ్యతిరేకించారని తెలుస్తుంది.అయితే కుటుంబ సభ్యులు కాదని చెప్పినప్పటికీ ఈమె మాత్రం తన కెరియర్ పట్ల ఈ డెసిషన్ తీసుకున్నారని ఇప్పటికే ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఈమె ఫిదా అయ్యారని కూడా తెలుస్తుంది.
అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారికంగా తెలియజేయబోతున్నట్లు సమాచారం.







