మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్”..
( Bhola Shankar )మరో రెండు వారాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
తమన్నా ( Tamanna )హీరోయిన్ గా నటిస్తుండగా. కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో వేగం పెంచేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోగా తాజాగా భోళా శంకర్ నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.
దీనికి ఫ్యాన్స్ నుండి యునామినస్ రెస్పాన్స్ లభించింది.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలోని మెగాస్టార్ పోస్టర్ ను భారీ కటౌట్ ( Cut-out )రూపంలో ఏర్పాటు చేసారు.విజయవాడ – హైదరాబాద్ హైవే పై సూర్యాపేట సమీపం లో రాజుగారి తోట రెస్టారెంట్ ఉన్న విషయం విదితమే.మరి ఈ రెస్టారెంట్ నిర్మాత అనిల్ సుంకరకు చెందినది అని కొద్దీ మందికి తెలుసు.
మరి ఆయన నిర్మాణంలో నిర్మించే సినిమాకు సంబంధించిన కటౌట్ ను ఆ రెస్టారెంట్ ముందు ఏర్పడు చేయడం జరుగుతుంది.అయితే ఎప్పటి కంటే ఈసారి మెగాస్టార్ భోళా శంకర్ కటౌట్ ను అతి భారీగా ఏర్పాటు చేసారు.
రాజు గారి తోట రెస్టారెంట్ ముందు ఏకంగా మెగాస్టార్ 126 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసారు.ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే అతి పెద్ద కటౌట్ గా చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఈ స్థాయిలో కటౌట్ ను ఏ సినిమా కోసం ఏర్పటు చేయలేదు.ఈ కటౌట్ తో మెగాస్టార్ చరిత్ర సృష్టించాడు.భోళా రికార్డులను ఇక్కడి నుండే మొదలు పెట్టాడు.దీంతో మెగా ఫ్యాన్స్ ఈ కటౌట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.







