షుగర్ బీట్ పంటను మెళుకువలతో సాగు చేసే విధానం..!

చక్కెర దుంప సాగు( Sugar beet )లో ఈ మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.ఈ పంట సాగుకు చల్లని అధిక తేమా అవసరం.నేలలో ఉష్ణోగ్రత 15.50C ఉన్నపుడు విత్తనాలు నాటితే ఉత్తమ అంకురోత్పత్తి బాగా జరుగుతుంది.వాతావరణంలో ఉష్ణోగ్రత 30° c కంటే ఎక్కువగా ఉంటే చక్కెర దుంపలో చక్కెర చేరడం పడిపోతుంది.అలా అని చలికాలంలో సాగు చేస్తే మైదాన ప్రాంతాలలో వేర్ల యొక్క వాణిజ్య సాగు సాధ్యమవుతుంది కానీ అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా విత్తనాలు మొలకెత్తడం అసాధ్యం అయ్యే అవకాశం ఉంది.

 Method Of Cultivation Of Sugar Beet Root Crop With Techniques..!, Cultivation ,-TeluguStop.com
Telugu Agriculture, Compost, Farmers, Plot Beds, Sugar Beet, Sugar Beet Crop-Lat

చక్కర దుంప విత్తనాలను నాటడానికి ముందు భూమిని నాలుగు లేదా ఐదు సార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆ తర్వాత భూమిని సమాంతరంగా చదును చేసుకోవాలి.పోలవరం ఇక పొలంలో గట్లు లేదంటే సాళ్లు లేదంటే ప్లాట్ బెడ్లు( Plot beds ) ఏర్పాటు చేయాలి.గట్లు ఏర్పాటు చేసుకుని నాటుకుంటే దుంపలు ఆరోగ్యంగా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది.

గట్లను 10 నుండి 12 సెంటీమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసుకొని, గట్ల మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు తయారు చేసుకోవాలి.చక్కెర దుంప విత్తనాలను సాధారణ నీటిలో నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.

ఇలా నానబెడితే దుంప విత్తనాలు అధికంగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.ఇంకా మెరుగైన అంకురోత్పత్తి పొందడానికి విత్తనాలను 0.25% మెర్క్యూరియల్ సమ్మేళనం లో రాత్రిపూట నానబెట్టి, ఉదయం విత్తనాలను ఒక గుడ్డ సంచిలో ఉంచాలి.

Telugu Agriculture, Compost, Farmers, Plot Beds, Sugar Beet, Sugar Beet Crop-Lat

ఎరువుల విషయానికొస్తే ఒక ఎకరం పొలంలో 25 టన్నుల కంపోస్టు లేదా పశువుల ఎరువు( Compost ) వేయాలి.ఇక ఒక ఎకరం పొలానికి 100 కిలోల నత్రజని, 80 కిలోల P2 O5, 80కిలోల పొటాషియం ఎరువులు వెయ్యాలి.అయితే నత్రజనిని ఒకేసారి కాకుండా మూడు సమభాగాలుగా విభజించి విత్తినప్పుడు ఒకసారి, రెండవది సన్నబడిన తరువాత, మూడవది ఎర్తింగ్ ఆపరేషన్ తర్వాత వేయాలి.

నీటి పారుదల విషయానికి వస్తే.ప్రతి టాప్ డ్రెస్సింగ్ అనంతరం పంటకు తేలికపాటి నీటి తడులను అందించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube