హీరోలకి డైరెక్టర్లకి మధ్య గొడవలు రావడం సాధారణం గా మనం చూస్తూనే ఉంటాము.దాని వల్ల ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి…అయితే కొన్ని సినిమాలు గొడవల వల్ల ఆగిపోయాయి మరి కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయాయి అలాంటి సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నాగ చైతన్య పరుశురాం సినిమా
డైరెక్టర్ పరుశురాం( Director Parasuram ) గీత గోవిందం లాంటి భారీ హిట్ కొట్టిన తరువాత నాగ చైతన్య తో( Naga Chaitanya ) సినిమా చేయాలి కానీ అలా చేయకుండా మహేష్ బాబు నుంచి ఆఫర్ రావడం తో ఆయన మహేష్ బాబు తో సినిమా చేసాడు.అదే సర్కారు వారి పాట ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ నాగ చైతన్య తో సినిమా చేయాలి అనుకున్న కూడా నాగ చైతన్య మహేష్ బాబు సినిమా ఛాన్స్ రాగానే నా సినిమా ని వదిలేసి వెళ్లిపోయావ్ అనే కోపం తో పరుశురాం తో సినిమా చేయను అని చెప్పి చిన్న గొడవ కూడా పెట్టుకున్నాడు అనే విషయం అయితే మనకు తెలిసిందే…

మహేష్ బాబు సుకుమార్
నిజానికి సుకుమార్( Sukumar ) రంగస్థలం సినిమా తర్వాత మహేష్ తో( Mahesh Babu ) సినిమా చేయాలి దానికి సంభందించిన ఒక కథ కూడా సుకుమార్ మహేష్ బాబు కి చెప్పిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ స్టోరీ మహేష్ కి కొంత వరకు నచ్చకపోవడం తో ఆ స్టోరీ ని మార్చమని సుకుమార్ కి చెప్తే ఆయన మార్చలేదు దాని వల్ల ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ సినిమాని ఆపేసారు…ఇది మహేష్ బాబు ఓపెన్ గా ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసాడు…

విశ్వక్ సేన్ అర్జున్
యాక్షన్ కింగ్ అర్జున్( Arjun ) డైరెక్షన్ లో విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరో గా చేయాల్సిన ఒక సినిమా ఆగిపోయింది దీనికి కారణం ఏంటంటే ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరిగినట్టు గా తెలుస్తుంది…అవి ఏంటంటే సినిమా స్టోరీ లో విశ్వక్ వేలు పెట్టడం అది నచ్చని అర్జున్ తనపైకి సీరియస్ అవ్వడం వల్ల ఈ సినిమా ఆగిపోయింది…
.







