మరో ఆఫర్ల పండగను సిద్ధం చేయబోతున్న అమెజాన్..! ఎప్పుడంటే..?!

కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ కంపెనీలు అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.అలాగే పండుగల సమయాల్లో ప్రత్యేక డిస్కౌంట్ సేల్ పెడుతూ ఉంటాయి.

 Amazon Is Going To Prepare Another Festival Of Offers..! When..?! Amazon Freedo-TeluguStop.com

ఈ కామర్స్ కంపెనీలు పోటీ పడి మరి ప్రత్యేక సేల్‌ ఆఫర్లు తీసుకొస్తూ ఉంటాయి.అందులో భాగంగా త్వరలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్ ఆఫర్‌ను తీసుకురానుంది.

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్వరలో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను ప్రవేశపెట్టనుంది.

ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్( Amazon freedom sale ) ను తీసుకురానున్నారు.ఈ సేల్ సందర్బంగా అనేక వస్తువులపై భారీ తగ్గింపుతో పాటు క్రెడిట్ కార్డులపై ఆఫర్స్ ఇవ్వనున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు( SBI Credit Card )పై 10 శాతం డిస్కౌంట్ అందించనున్నారు.

ఇక శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్ మీ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు భారీ డిస్కౌంట్ ఇవ్వనుంది.ఇక స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్, వైర్ లెస్ ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 24 గంటల ముందే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.ఇటీవల అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రైమ్ డే సేల్ ను అమెజాన్ ప్రవేశపెట్టింది.అయితే ఈ సారి అందరి కోసం ఈ సేల్ తీసుకొచ్చింది.అయితే ఏ వస్తువులపై ఎంత డిస్కౌంట్ అనేది త్వరలో వెల్లడించనుంది.ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడమ్ సేల్ ను అమెజాన్ తీసుకొస్తూ ఉంటుంది.అందులో భాగంానే ఈ ఏడాది కూడా సేల్ ను తీసుకొస్తుంది.

ఈ సేల్ స్మార్ట్ ఫోన్లు( smart phones), ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునేవారికి బాగా ఉపయోగపడనుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube