అసలే చలికాలం కొనసాగుతోంది.ఈ సీజన్ లో ప్రధానంగా వేధించే సమస్యల్లో డ్రై స్కిన్ అనేది ముందు వరుసలో ఉంటుంది.
వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా చర్మంలో తేమ తగ్గిపోయి డ్రై గా మారుతుంటుంది.అందులోనూ పొడి చర్మ తత్వం కలిగిన వారికి ఈ చలికాలం మరింత దుర్భరం గా మారుతుంది.
వీరు చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు ఎంతో ఖరీదైన మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు.అయినా సరే ముఖం తరచూ డ్రైగా మారుతుంటుంది.
దాంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ట్రై చేస్తే కనుక చర్మం తేమగా మరియు నిగారింపుగా మెరుస్తుంది.
డ్రై స్కిన్ అన్న మాటే అనరు.ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కప్పు రోజు వాటర్ ను వేసుకోవాలి.అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకుంటే టోనర్ సిద్ధమవుతుంది.
ఈ టోనర్ ను ఒక బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.దూది సహాయంతో ఈ టోనర్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు రాత్రి నిద్రపోవడానికి ముందు ఈ టోనర్ ను వాడితే ముఖం తరచూ డ్రైగా మారకుండా ఉంటుంది.చర్మం తేమగా అదే సమయంలో నిగారింపుగా మెరుస్తుంది.
అలాగే మరో విధంగా కూడా డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పాల మీగడ, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకుని అన్నీ కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా చేసిన సరే పొడి చర్మం నుంచి విముక్తి లభిస్తుంది.
ఇక తమ చర్మం తరచూ డ్రై అయిపోతుందని భావించేవారు.రోజు స్నానం చేయడానికి గంట ముందు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసుకుని కనీసం పది నిమిషాలు అయినా మర్దన చేసుకోవాలి.
ఇలా చేసిన సరే మంచి ఫలితం ఉంటుంది.