తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది.కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం ప్రతిమ కాలేజీలో 200 మెడికల్ సీట్లు ఉండగా మరో 50 సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.దీంతో కాలేజీలో మెడికల్ సీట్ల సంఖ్య 250కి పెరిగింది.
ఇటీవల కాలంలో కాలేజీలో సీట్ల సంఖ్య పెంచాలన్న విద్యార్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో మార్బ్ తీసుకున్న నిర్ణయంతో ఎంబీబీఎస్ చదవాలనుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తెలంగాణలో అత్యధిక సీట్లు ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీగా ప్రతిమ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ పేరుగాంచిన విషయం తెలిసిందే.







