చిరంజీవి మెహర్ రమేష్( Meher Ramesh ) కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ( Bhola Shankar Movie ) ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.ఈ ట్రైలర్ కు ఇప్పటివరకు దాదాపుగా 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.ప్రేక్షకుల్లో నెలకొన్న అనుమానాలను దర్శకుడు మెహర్ రమేష్ పటాపంచలు చేశారు.
కథ రొటీన్ అయినా చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో వాల్తేరు వీరయ్య( Waltheru Veeraya ) సినిమాలా కమర్షియల్ గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సినిమాలో ఒక షాట్ లో చిరంజీవి హీరో రాజశేఖర్ మేనరిజమ్స్ ను ఇమిటేట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సినిమా చూస్తే ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ ను నిజంగా ఇమిటేట్ చేస్తే మాత్రం రాజశేఖర్ కుటుంబం ఫీలయ్యే అవకాశం ఉంది.చిరంజీవి రెమ్యునరేషన్ 40 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.చిరంజీవి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సమాచారం అందుతోంది.చిరంజీవి పాన్ ఇండియా సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.

అటు కీర్తి సురేశ్ ( Keerthy Suresh )కు ఇటు తమన్నాకు తెలుగులో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందేమో చూడాల్సి ఉంది.భోళా శంకర్ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.







