కెనడా : కిరాణా సరుకుల కోసం బయటికి .. కారులో శవమై తేలిన భారతీయుడు, రంగంలోకి పోలీసులు

కెనడాలో భారతీయుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.మృతుడిని భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం భోగ్‌పూర్‌లోని నంగల్ ఫిదా గ్రామానికి చెందిన భూపీందర్ సింగ్ రంధావా ( Bhupinder Singh Randhawa ) (38)గా గుర్తించారు.2013లో కెనడాకు వెళ్లిన భూపీందర్ కుటుంబం కోసం శ్రమిస్తున్నాడు.ఇలా వుండగా ఈ వారంలో భూపీందర్ కనిపించడం లేదని అతని కుటుంబానికి సమాచారం అందింది.

 Indian Man Died Under Mysterious Circumstances In Canada Police Launch Investiga-TeluguStop.com

కిరణా సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లిన భూపీందర్ మళ్లీ తిరిగి రాలేదని, అతని ఫోన్ స్పందించడం లేదని తెలిపారు.దీంతో ఆయన కుటుంబ సభ్యులు కెనడా పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు భూపీందర్ వాహనం రోడ్డు పక్కన నిలిపి వుండటాన్ని గుర్తించారు.కారును తనిఖీ చేస్తుండగా .అతను అపస్మారక స్థితిలో పడివున్నాడు.భూపీందర్‌‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.

అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.భూపీందర్ మరణానికి దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అతనికి భార్య, పదేళ్ల కుమార్తె వున్నారు.భూపీందర్ మరణంతో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బంధుమిత్రులు, పలువురు రాజకీయ నాయకులు సింగ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

Telugu Bhupindersingh, Canada, Highway, Riverbank-Telugu NRI

ఇకపోతే.గత నెలలో కెనడాలో( Canada ) అదృశ్యమైన భారతీయ విద్యార్ధి కథ విషాదాంతమైంది.అనుమానాస్పద స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

పశ్చిమ మానిటోబోలోని ఓ నగరం నుంచి విషయ్ పటేల్ అనే విద్యార్ధి అదృశ్యమయ్యారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో బ్రాండన్ నగరానికి తూర్పున వున్న అస్సినిబోయిన్ నది, హైవే 110 ( Assiniboine River, Highway 110 )వంతెనకు సమీపంలో పటేల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Telugu Bhupindersingh, Canada, Highway, Riverbank-Telugu NRI

బాధితుడు జూన్ 16న ఉదయం తప్పిపోయినట్లు బంధువులు తెలిపారు.గ్రే కలర్ 2012 మోడల్ హోండా సివిక్‌లో తన ఇంటి నుంచి బయలుదేరినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించినట్లు ది బ్రాండన్ సన్ నివేదించింది.పటేల్ అదృశ్యమైన అదే రోజు సాయంత్రం స్థానిక హోమ్ డిపో పార్కింగ్ స్థలంలో సివిక్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రివర్ బ్యాంక్ డిస్కవరీ సెంటర్ గ్రౌండ్స్ వైపు పటేల్ నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశామని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు.దీంతో జూన్ 17న మధ్యాహ్నం నాటికి బ్రాండన్ పోలీస్ సర్వీస్ (బీపీఎస్) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో జూన్ 18 (ఆదివారం) సాయంత్రం ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ఆ ప్రాంతంలో జరిపిన శోధన ఫలితంగా తప్పిపోయిన పటేల్ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.గుజరాత్‌కు చెందిన పటేల్‌ గత రెండేళ్లుగా అస్సినిబోయిన్ కమ్యూనిటీ కాలేజ్‌‌లో చదువుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube