పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సాయి ధరంతేజ్ (Sai Dharam Tej) హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో(Bro) ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇక ఈ సినిమా నేడు విడుదల కావడంతో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తన మామయ్య పవన్ కళ్యాణ్ తో చిన్నప్పుడు దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాయి ధరమ్ తేజ్ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈయన షేర్ చేశారు.
ఈ ఫోటోని షేర్ చేసినటువంటి సాయి తేజ్ అప్పటికి ఇప్పటికీ అంటూ ఒక క్యాప్షన్ ఇవ్వడమే కాకుండా తన మామయ్య గురించి తన కెరియర్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ప్రస్తుతం నాలోని ప్రతి ఒక్క భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలని అనుకుంటున్నాను.నా గురువు నా మామయ్య, నా స్ఫూర్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా ఉంది.ఇప్పటికి నేను ఆయన చేయి పట్టుకున్నటువంటి ఒక చిన్న పిల్లాడిని నాకు తనతో కలిసి సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) గారికి కృతజ్ఞతలని తెలిపారు.
ఈ సినిమాతో నా కల నెరవేరిందని సాయి తేజ్ ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ సినిమాలో నాకు నటించే అవకాశం కల్పించిన చిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అలాగే నా ముగ్గురు మామయ్యలకు వారి అభిమానులకు సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష(Virupaksha) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించారు.ప్రస్తుతం ఈయన పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.







