టాలీవుడ్ లో బాలీవుడ్ నటుల పారితోషికాలు ఇవే.. సైఫ్, సంజయ్ దత్ రెమ్యునరేషన్లు ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలీవుడ్ నటులకు ప్రాధాన్యత పెరుగుతోంది.హిందీలో హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లను తెలుగులో విలన్లుగా నటింపజేయడానికి టాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

 Bollywood Actors Remuneration In Tollywood Industry Details Here Goes Viral In S-TeluguStop.com

బాలీవుడ్ హీరోయిన్లకు సైతం తెలుగులో ప్రాధాన్యత పెరుగుతుండటం గమనార్హం.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవర టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్( Saif Ali Khan ) రోల్ లో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం సైఫ్ అలీ ఖాన్ ఏకంగా 14 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని దేవర మేకర్స్ సైతం ఆ మొత్తం ఇవ్వడానికి అంగీకరించారని తెలుస్తోంది.

ఇదే సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.జాన్వీకి రెమ్యునరేషన్( Janhvi Kapoor ) కోసం 4 కోట్ల రూపాయలు ఇస్తున్నారని అదనపు ఖర్చులకు సంబంధించి ఆమెకు కోటి రూపాయల వరకు అందుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Bollywood, Devara, Jahnvi Kapoor, Koratala Siva, Mrunal Thakur, Saif Ali

సీతారామం సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ కు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగిందనే సంగతి తెలిసిందే.ఈ బ్యూటీకి నిర్మాతలు ఏకంగా 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారట.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మృణాల్ ఠాకూర్ పారితోషికం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Bollywood, Devara, Jahnvi Kapoor, Koratala Siva, Mrunal Thakur, Saif Ali

మృణాల్ ఠాకూర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.మరోవైపు రామ్ పూరీ కాంబినేషన్ మూవీలో సంజయ్ దత్( Sanjay Dutt ) విలన్ గా ఎంపికైనట్టు భోగట్టా.ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఏకంగా 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోయిన్లు, విలన్లు సత్తా చాటుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో బాలీవుడ్ నటుల హవా మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube