బ్రో మూవీ ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. పవన్ ఫ్యాన్స్ కు విందు భోజనమే కానీ?

పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ( Bro movie) తాజాగా థియేటర్లలో విడుదలైంది.ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు పూర్తయ్యాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల నుంచి బ్రో మూవీ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.2 గంటల 15 నిమిషాల నిడివితో విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు విందు భోజనంలా ఉండటం గమనార్హం.

 Pawan Kalyan Bro Movie Plus And Minus Points Details Here Goes Viral In Social M-TeluguStop.com
Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Tollywood, Trivikram-Mo

వినోదాయ సిత్తం సినిమాతో పోల్చి చూస్తే కథ పరంగా స్వల్పంగా మార్పులు చేయగా పవన్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు అన్నీ సినిమాలో ఉన్నాయి.ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ లేవని సాయితేజ్( Sai Dharam Tej )చెప్పినా మేకర్స్ మాత్రం తెలివిగా పొలిటికల్ డైలాగ్స్ ను పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.సాంగ్స్ విషయంలో పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిన థమన్ బీజీఎం విషయంలో మాత్రం అదుర్స్ అనిపించడం గమనార్హం.

Telugu Bro, Pawan Kalyan, Sai Dharam Tej, Samuthirakani, Tollywood, Trivikram-Mo

పవన్ కళ్యాణ్, సాయితేజ్ అద్భుతమైన నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్( Pawan kalyan ) హిట్ సాంగ్స్ తో చేసిన ప్రయోగం ఫలించింది.తక్కువ నిడివి ఉండటంతో ఎలాంటి ల్యాగ్ లేకుండా సినిమాను చూసిన అనుభవం ప్రేక్షకులకు కలుగుతుంది.

ఫస్టాఫ్ లోని కొన్ని కామెడీ సన్నివేశాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంతో పాటు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి.ఓవర్సీస్ ఆడియన్స్ బ్రో మువీ హిట్ బొమ్మ అని చెబుతున్నారు.

కథ బాగానే ఉన్నా కథనం విషయంలో కొన్ని పొరపాట్లు ఉండటం, ఒరిజినల్ స్టోరీలో ఉన్న మంచి ఫీల్ ను ఈ సినిమాలో మిస్ చేయడం, కథకు ఏ మాత్రం అవసరం లేని కొన్ని సీన్లకు ప్రాధాన్యత ఇవ్వడం బ్రో సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.న్యూట్రల్ ఆడియన్స్ రియాక్షన్ ను బట్టి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ డిసైడ్ అవుతుంది.

చిన్నచిన్న లోపాలు ఉన్నా పవన్ అభిమానులను మాత్రం ఈ సినిమా నిరాశపరచదనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube