రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోనీ కిషన్ దాస్ పేట లో గత రెండు రోజులుగా వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇండ్లలో కనీసం నివాసయోగ్యంగా లేని ముద్ధం నడిపి ఎల్లయ్య,బీపెట భూమయ్య కుటుంబాల ఇంటికి వెళ్ళి పరిశీలించిన సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి పరిస్థితి చూసి చలించి తన ఫంక్షన్ హాలు లో వర్షాలు తగ్గే వరకు ఉండాలని మూడు పూటలా భోజనం పెడుతానని చెప్పగా వారిని ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు ఆటోలో వారికి చెందిన రెండు కుటుంబాల సామాను ఇచ్చి ఫంక్షన్ హాలు కు తరలించారు.వర్షాలు తగ్గు ముఖం పట్టే వరకు ఆశ్రయం కల్పించడం కాక బోజన సదుపాయం కల్పించిన సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కీ వారు కృతజ్ఞతలు తెలిపారు.
Latest Rajanna Sircilla News