ఒకప్పుడు మంచి హిట్స్ ఇచ్చి గత కొద్దిరోజులుగా సక్సెస్ లు లేక ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్లు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు.అందుకే వాళ్ళు ఎలాగైనా ఒక మంచి సినిమా తీసి మళ్ళీ మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు అలాంటి వాళ్లలో రవి బాబు( Ravi Babu ) మొదటి స్థానం లో ఉన్నారు…ఈయన మొదట్లో వరసగా హిట్ సినిమాలు తీసి డైరెక్టర్ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఇక ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ప్లాప్ అవ్వడం తో ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలు చేయాలని చూస్తున్నారు…

ఇక హిట్ లేకుండ ఉన్న మరో డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి( Chandra Sekhar Yeleti ) తెలుగు లో ఈయన ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్న డైరెక్టర్…అందుకే ఈయన చేసే సినిమాలు అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి…ఇక ఈ లిస్ట్ లో ఇంకో డైరెక్టర్ తేజ( Director Teja ) ఈయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు గా 23 సంవత్సరాలు అవుతుంది.ఆయన చాలా సినిమాలకి డైరెక్షన్ కూడా చేశాడు మొదట్లో చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో హైట్రిక్ హిట్ కొట్టిన తేజ మధ్య చాలా సంవత్సరాల పాటు ఒక్క హిట్ కూడా లేదు…

ఇక 2017 లో వచ్చిన నేను రాజు నేనే మంత్రి సినిమా తో మంచి హిట్టిచ్చిన కూడా ఆ తర్వాత వచ్చిన సీత మొన్న వచ్చిన అహింస రెండు కూడా ప్లాప్ అయ్యాయి…దీంతో తేజ కి ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి…ఇక ప్రస్తుతం ఈయన మరో కొత్త హీరో తో సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుంది అనేది వేచి చూడాలి…








