నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.అయితే తాజాగా ఈమె విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో కలిసి నటించిన సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

విజయ్ దేవరకొండ రష్మిక జంటకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తూనే ఉంటాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గీతా గోవిందం(Geetha Govindam) ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది.అనంతరం వీరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్(Dear Comrade) అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డైరెక్టర్ భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ విజయ్ దేవరకొండ రష్మికకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ క్రమంలోనే రష్మిక విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా జులై 26వ తేదీకి విడుదలై సరిగ్గా నాలుగు సంవత్సరాలను పూర్తి చేసుకోవడంతో ఈమె డైరెక్టర్ భరత్( Director Bharath ) హీరో విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ డియర్ కామ్రేడ్ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమే థాంక్యూ భరత్ అండ్ విజయ్ అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్లో ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







