బీహార్ లో పోలీసుల కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.కతిహార్ లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని సమాచారం.బార్సోయ్ బ్లాక్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా.
మరో ముగ్గురికి గాయాలు అయ్యాయిని తెలుస్తోంది.దీంతో బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కాగా నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళనకారులు చెబుతున్నారు.







