ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు రీ కౌంటింగ్ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్ పై న్యాయస్థాం విచారణ చేసింది.
ఈ విషయంపై ఇప్పటికే అడ్వకేట్ కమిషన్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.ఈ క్రమంలో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ నివేదికపై శుక్రవారం విచారణ చేస్తామని తెలిపింది.
అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.







