'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?

అనుష్క శెట్టి ( Anushka Shetty ) హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.( Miss Shetty Mr Polishetty ).

 Miss Shetty Mr Polishetty Release Postponed, Anushka Shetty , Naveen Polishetty-TeluguStop.com

ఈ సినిమా కోసం అనుష్క ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయి బాగా మెప్పించడమే కాకుండా మరిన్ని పాజిటివ్ వైబ్స్ కలిగించింది.

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అనుష్క బాహుబలి తర్వాత నిశ్శబ్దం అనే సినిమాను చేసి అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఈసారి కూడా నిరాశ అయ్యేలానే కనిపిస్తున్నాయి.

ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

అందుకే ఆగస్టు 4న రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.కానీ రిలీజ్ కు 10 రోజులు కూడా లేదు.

అయినా ఇంత వరకు ప్రమోషన్స్ చేయలేదు.

ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమాపై బజ్ కూడా పెరగలేదు.అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడనుంది అని అందుకే ప్రమోషన్స్ చేయడం లేదని టాక్ వైరల్ అయ్యింది.ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అందుకే ఈ సినిమా వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తుంది.

బహుశా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తారని సమాచారం.చూడాలి ఫ్యాన్స్ ను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూసేలా చేస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube