‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?

అనుష్క శెట్టి ( Anushka Shetty ) హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ''మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి''.

( Miss Shetty Mr Polishetty ).ఈ సినిమా కోసం అనుష్క ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయి బాగా మెప్పించడమే కాకుండా మరిన్ని పాజిటివ్ వైబ్స్ కలిగించింది.

"""/" / ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన అనుష్క బాహుబలి తర్వాత నిశ్శబ్దం అనే సినిమాను చేసి అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.

అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఈసారి కూడా నిరాశ అయ్యేలానే కనిపిస్తున్నాయి.ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.అందుకే ఆగస్టు 4న రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

కానీ రిలీజ్ కు 10 రోజులు కూడా లేదు.అయినా ఇంత వరకు ప్రమోషన్స్ చేయలేదు.

"""/" / ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమాపై బజ్ కూడా పెరగలేదు.అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడనుంది అని అందుకే ప్రమోషన్స్ చేయడం లేదని టాక్ వైరల్ అయ్యింది.

ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అందుకే ఈ సినిమా వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తుంది.

బహుశా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తారని సమాచారం.చూడాలి ఫ్యాన్స్ ను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూసేలా చేస్తారో.