బిఆర్‌ఎస్ ను( BRS ) జాతీయ స్థాయిలో విస్తరించాలని, తెలంగాణ మోడల్ ను దేశంలో అమలు చేయాలనే ఉద్దేశంతో కేసిఆర్( KCR ) జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు కూడా.
అయితే మోడిని గద్దె దించడమే లక్ష్యంగా ఉన్న కేసిఆర్.విపక్షలను ఏకం చేసేందుకు మొదట గట్టిగానే ప్రయత్నించారు.
బిహార్ సిఎం నితిశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ వంటి వారిని కలిసి కూటమి దిశగా అడుగులు వేశారు.కానీ ఏమైందో తెలియదు గాని.
ఒక్కసారిగా కూటమి విషయంలో సైలెంట్ అయి ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు.
మరోవైపు విపక్షాలు మాత్రం ఏకమై కూటమిగా ఏర్పడి ” INDIA ” గా రూపాంతరం చెందాయి.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రస్తుతం విపక్షాలతో కేసిఆర్ కలిసేందుకు గాని.అటు విపక్షాలు కేసిఆర్ ను కలుపుకునేందుకు గాని అసలు ప్రయత్నం చేయడం లేదు.
దీంతో కేసిఆర్ ఒంటరిగానే జాతీయ రాజకీయాల్లో( National Politics ) సత్తా చాటలని భావిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బిఆర్‌ఎస్ ఎప్పుడు సమదూరంగానే ఉంటుందని, ఆ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని కేసిఆర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.

అందుకే కేంద్ర కూటమిలలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలదే ప్రధాన పాత్ర అందుకే విపక్షాల వైపు గాని, ఇటు ఎన్డీయే( NDA ) కూటమివైపు గాని లేకుండా సింగిల్ ఎజెండా తో బిఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది.అయితే బిఆర్‌ఎస్ అంతర్గతంగా INDIA కూటమితో( INDIA Alliance ) పొత్తులో ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.కాంగ్రెస్ తో ఎడమొఖం పెడమొఖం పైపైనే అని అంతర్గతంగా రెండు పార్టీల మద్య లోపాయికారి ఒప్పందం ఉందనేది బీజేపీ నేతలు చెబుతున్నా మాట.

INDIA కూటమిలో బిఆర్‌ఎస్ అధికారికంగా లేకపోయినప్పటికి అన్నీ సహాయ సహకారాలు కేసిఆర్ అందిస్తున్నారని చెబుతున్నారు కమలనాథులు.మరి నిజంగానే బిఆర్‌ఎస్ INDIA కూటమిలో ఉందా ? ఒకవేళ ఉంటే కేసిఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారనేది ఆసక్తికరమైన అంశం.మరి వీటిపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.







