Rashmika Vijay Devarakonda: ప్రియుడి షర్టు వేసుకున్న రష్మిక మందన.. ప్రేమ ఉందనడానికి ఇంతకుమించి సాక్ష్యం కావాలా అంటూ?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన( Rashmika ) ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ జంటపై విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

 Actress Rashmika Mandanna Wearing Vijay Devarakonda Shirt-TeluguStop.com

కానీ రష్మిక విజయ్ లు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పడేస్తున్నారు.లవ్, రిలేషన్ షిప్ లేదంటూనే కలిసి పార్టీలకు వెళ్లడం వెకేషన్ లు తిరగడం పార్టీలు చేసుకోవడంతో ఆ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

కాగా వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో సార్లు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.కానీ వారి ప్రేమకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక విజయ్ స్పందిస్తూ మేము కేవలం స్నేహితుల మాత్రమే అని తెలిపారు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి వీరిద్దరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ మారింది.ఇక ఇటీవల విజయ్, రష్మికలు దుబాయ్ ( Dubai ) వెళ్లినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

అందుకు సంబంధించి ఫోటోస్ కూడా సోషల్ వైరల్ అవుతున్నాయి.అంతేకాదు విజయ్ అక్కడి నుంచి ఒక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Telugu Rashmikaboy, Rashmikavijay, Tollywood-Movie

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా రష్మిక ఎయిర్‌ పోర్టులో కెమెరా కంటికి చిక్కింది.ఈ సారి ఆమె విజయ్ దేవరకొండతో కనిపించలేదు, దానికి బదులు విజయ్ దేవరకొండ వేసుకున్న చొక్కా( Vijay Devarakonda Shirt ) వేసుకుని హాట్ టాపిక్ గా నిలిచింది.ఇంతకుముందు విజయ్ దేవరకొండ ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చేటపుడు పర్పుల్ కలర్ స్ట్రిప్స్ షర్ట్ వేసుకున్నాడు, ఇప్పుడు విజయ్ దేవరకొండ వేసుకున్న షర్ట్ నే రష్మిక వేసుకోవడం చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.మొన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి వెళ్లిన రష్మీక ఫోటోను ఎవరో క్లిక్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

Telugu Rashmikaboy, Rashmikavijay, Tollywood-Movie

కాగా రష్మిక మందన, విజయ్ దేవరకొండ షర్టు ధరించడంతో వారి మధ్య ప్రేమ ఉందని ఇంతకు మించిన సాక్ష్యం కావాలా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.అయితే ఈ రూమర్లను రష్మిక మందన్న గతంలోనే ఖండించింది.విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే.తమ మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే అని కూడా చెప్పింది.అయినప్పటికీ కొందరు మాత్రం వీళ్ళ డేటింగ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube