వానలో చాలా రకాలు ఉంటాయి.చిరు జల్లులు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, ముసురు వాన, వడగళ్ల వాన, ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన వర్షాలు లాంటివి చాలా ఉంటాయి.
అయితే గాంధారి వాన( Gandhari Rain ) అని కూడా ఒకటి ఉంది.గాంధారి పేరు వినగానే దృతరాష్ట్రుని భార్య అని మనందరికీ గుర్తుకొస్తుంది.
అసలు గాంధారికి, వానకు సంబంధమేంటి? గాంధారి వాన అని దేనిని అంటారు? ఆమె పేరుతోనే వానను ఎందుకు పిలుస్తారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గాంధారి వాన అనగా అవసరం లేనప్పుడు పడే పెద్ద వాన అని చెబుతుంటారు.సింపుల్‌గా చెప్పాలంటే అకాల వర్షాలు.మహాభారతం చదివితే దుర్యోధనుడి తల్లి, దృతరాష్ట్రుని( Dritharashtra ) భార్య అయిన గాంధారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
ఆమె గాంధారి దేశానికి రాజకుమారి.గాంధారికి నూటొక్కమంది పిల్లలు ఉన్నారు.
ధృతరాష్ట్రుడికి కళ్లు లేవు.దీంతో తన భర్తకు కళ్లు లేవనే కారణంతో గాంధారి కూడా కళ్లకు గంతలు కట్టుకుంటుంది.
దీని వల్ల పిల్లలను తడిమి చూసుకునేది గానీ వాళ్లు ఎలా పెరుగుతున్నారు? సరైన మార్గంలో నడుస్తున్నారా? అనేది తెలిసేది కాదు.అలాగే దృతరాష్ట్రుడు కూడా పట్టించుకునేవాడు కాదు.
దీంతో పాండవులపై కౌరవులు అకృత్యాలకు పాల్పడటం వల్ల అనేక నష్టాలు జరిగాయి.

అలాగే అవసరం లేని సమయంలో పడే అకాల భారీ వర్షాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.వాటి వల్ల పంటకు నష్టం జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదు.తప్పుడు మార్గంలో ప్రయాణించి కౌరవలు నాశనం అయినట్లు పంటకు కూడా అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుంది.
అందుకే అవసరం లేని సమయంలో పడే భారీ వానను గాంధారి వాన అని పిలుస్తారు.







