గత కొన్ని రోజులుగా ఉపాసన తమన్నా( Tamannah )కి ఖరీదైన డైమండ్ రింగ్ ని బహుమతిగా ఇచ్చింది అంటూ ఎన్ని వార్తలు ఫోటోలతో సహా చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ తలలు పట్టుకుంటున్నారు.
ఎందుకంటే ఉపాసన( Upasana ) ఏంటి రెండు కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్ ని తమన్నాకి గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి.అని అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కొంతమంది మాత్రం నిజంగానే ఉపాసన విలువైన రింగుని తమన్నాకి గిఫ్ట్ గా ఇచ్చింది అని కరాకండిగా చెప్పడంతో అందరూ నిజమే అనుకున్నారు.
అంతేకాదు తమన్నా డైమండ్ రింగ్( Diamond Ring ) ని పెట్టుకొని ఉన్న ఫోటోని ఉపాసన షేర్ చేస్తూ తమన్నాని ఓ రేంజ్ లో పొగిడిందని కూడా వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ అసలు విషయం బయటపెట్టింది తమన్నా( Tamannah ) .ఇక అసలు విషయంలోకి వెళ్తే.సెలబ్రిటీల గురించి ఎలాంటి విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా కూడా ఆ విషయాలు వారి దాకా వెళ్తే కచ్చితంగా వాటిపై క్లారిటీ ఇస్తారు.
ఒకవేళ వారి ప్రేమ, పెళ్లి విషయాలు మాత్రం నిజమైతే కొన్ని రోజులు సస్పెన్స్ లో పెట్టేస్తారు.అయితే తాజాగా ఉపాసన కి తమన్న రెండు కోట్ల డైమండ్ రింగు ప్రేమతో ఇచ్చింది అనే వార్త తెగ చక్కర్లు కొట్టడంతో ఆ వార్త చివరికి తమన్నా దాకా చేరిందట.
అయితే ఈ వార్త పై తమన్నా క్లారిటీ ఇస్తూ.మీరందరూ అనుకుంటున్నట్లు నాకు రెండు కోట్ల విలువైన డైమండ్ రింగుని ఉపాసన గిఫ్ట్ గా ఇవ్వలేదు.

అంతేకాకుండా నా వేలికి పెట్టుకుంది అసలు డైమండ్ రింగే కాదు.ఎందుకంటే నేను నా వేలికి సోడా బాటిల్ ఓపెనర్ ని పెట్టుకోవడంతోనే అది నాకు చాలా బాగా నచ్చింది.దాంతో బాగుంది కదా అని కొన్ని ఫొటోస్ దిగాను.అయితే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అది డైమండ్ రింగ్ అని,నాకు ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చింది అని ప్రచారం చేస్తున్నారు.
కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని అసలు విషయాన్ని తమన్న చెప్పేసింది.దీంతో ఇన్ని రోజులు ఉపాసన తమన్నాకి గిఫ్ట్ ఇచ్చింది అనే వార్తలకు చెక్ పడినట్లు అయింది.







