సాధారణంగా ఆటో డ్రైవర్లు పది కిలోమీటర్లకి రూ.20 చొప్పున డబ్బులు తీసుకుంటారు.అదే సిటీలో అయితే ఈ డబ్బులు రెట్టింపులో ఉంటాయి.అంతేకానీ జస్ట్ ఒకే ఒక కిలోమీటర్‌కి వంద రూపాయలు తీసుకోవడం అనేది ఎక్కడా కనిపించదు.కానీ బెంగళూరులో మాత్రం అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయడం షరా మామూలే అని తెలుస్తోంది.వివరాల్లోకి వెళితే.
రీసెంట్‌గా ముంబైకి చెందిన మందార్ నటేకర్ అనే సీఈఓ( Mandar Natekar ) పర్యటన నిమిత్తం బెంగళూరు వెళ్లారు.అతను అక్కడ ఆటో ఎక్కారు.
బెంగళూరులో ఆటో డ్రైవర్లు ఛార్జీలు వసూలు చేయడానికి మీటర్ ఉపయోగించరని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయారు.బదులుగా, వారు రైడ్ కోసం నిర్ణీత మొత్తంలో డబ్బు అడుగుతారని తెలిసి షాక్ అయ్యారు.
సీఈవో ఉన్న ముంబైలో, ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీని క్యాలిక్యులేట్ చేసే మీటర్ ఉపయోగించి ఆటో రైడ్‌లకు ఛార్జ్ చేస్తారు.

బెంగళూరు( Bengaluru )లో మాత్రం ఓ ఆటో డ్రైవర్ కేవలం 500 మీటర్ల రైడ్‌కు రూ.100 వసూలు చేశాడు, ఇది ముంబైతో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని సిటీలతో పోలిస్తే చాలా ఖరీదైనది.సీఈఓ తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవం గురించి ట్విట్టర్‌లో పంచుకున్నారు.ఈ రేటు చాలా ఎక్కువ అని, ముంబైలో 9 కిలోమీటర్లు తీసుకెళ్తారని రూ.100 తీసుకుంటారని అన్నారు.అలాంటిది ఇక్కడ 500 మీటర్లకే వంద రూపాయలు తీసుకోవడం చాలా దారుణమని పేర్కొన్నారు.

ఇక వివిధ నగరాల్లో ఆటో రైడ్‌ల ఛార్జీలు చాలా భిన్నంగా ఉంటాయని, చెన్నైలో ఆటో రైడ్‌లు మరింత ఖరీదైనవిగా ఉంటాయని కొందరు చెప్పారు.ట్రాఫిక్ రోడ్లు బాగో లేకపోయినా ముంబైలో ఆటో డ్రైవర్లు తక్కువగానే ఛార్జ్ చేస్తారని కానీ బెంగళూరు రోడ్లు బాగున్నప్పటికీ డ్రైవర్లు ఎక్కువ డబ్బులు వసూలు చేయడం అన్యాయంగా ఉందని ఇంకొందరు కామెంట్ చేశారు.500 మీటర్లు మాత్రమే అయితే నడిచి వెళ్లడం బెటర్, ఆటోలో ఎందుకు అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.కానీ ఎక్కువ దూరం నడిచే పరిస్థితిలో లేనని, ఆరోగ్య సమస్య ఉందని సదర సీఈవో రిప్లై ఇచ్చారు.







