మారుతున్న టెక్నాలజీ( Technology ) కి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పి( Rajanna Sircilla SP Akhil Mahajan ) అన్నారు.ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖ నూతనంగా ఆవిష్కరించిన సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.09 ( CCTNS Version 2.0 ) కు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిసిటిఎన్ఎస్ నూతనంగా లాంచ్ చేసిన 2.0 అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందని, సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0 తో అధికారులు సిబ్బంది పని భారం లేకుండా ఉత్సాహంగా విధులు నిర్వహించుకోవచ్చని తెలిపారు.సిసిటిఎన్ఎస్ 1.0 తో పోలిస్తే సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0 వాడటం మనదే చాలా ఈజీగా ఉంటుందని దీనిని స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో నమోదయిన అన్ని కేసుల వివరాలు సీసీటీఎన్ స్ (ది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెటవర్క్స్ అండ్ సిస్టమ్స్ ) లో అప్లోడ్ చేసి పెండింగ్ కేసులను పూర్తి చేయాలని సూచించారు.ప్రస్తుతం పోలీసు శాఖ లో సాంకేతిక వ్యవస్థ కీలక భాగంగా ఉందని, ఎప్పటికపుడు వివరాలు ఆన్లైన్ లో సరైన విధంగా నమోదు చేస్తూ మరింత పటిష్టమైన వ్యవస్థ రూపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి, వృత్తి నైపుణ్యం లో రోజువారీ పురోగతి( Development ) సాధించాలిని అన్నారు.
ప్రతి ఒక్కరికీ విధి నిర్వహణ గురించి రోల్ క్లారిటీ తెలిసి ఉండాలన్నారు.వర్టికల్ వారిగా విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది వారు చేసే విధులు సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.సిసిటిఎన్ఎస్ నూతన వర్షన్ 2.0వర్క్ కు సంబంధించి టెక్ టీమ్ సిబ్బందిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు గైడ్ చేయాలని సూచించారు.అదేవిధంగా సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఐటీ కోర్ ఎస్.ఐ కిరణ్ ,వి.సి లో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.







