బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్‌ చేసినా కూడా పాపం ఆమెను పట్టించుకోరేం?

ఒక హీరో మినిమం సక్సెస్ దక్కించుకుంటే ఆ హీరో వెంట పడటం కామన్‌ విషయం… ఒక దర్శకుడు హిట్ కొడితే అడ్వాన్స్ ల మీద అడ్వాన్స్ లు ఇవ్వడం కూడా కామన్‌ విషయం.కానీ ఒక హీరోయిన్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమా చేసి సక్సెస్ దక్కించుకున్నా కూడా వావ్‌ అంటూ అభినందించడం వరకు ఓకే కానీ ఆఫర్లు మాత్రం దక్కేది అంతంత మాత్రమే.

 The Kerala Story Heroine Adah Sharma Not Getting Offers , The Kerala Story, Adah-TeluguStop.com

ఇందుకు మరో ప్రత్యక్ష సాక్ష్యం ముద్దుగుమ్మ అదా శర్మ( Ada Sharma ).ఈ అమ్మడు ది కేరళ స్టోరీ ( The Kerala Story )సినిమా తో సూపర్ డూపర్ సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.చిన్న సినిమా గా వచ్చిన ఆ సినిమా వివాదాల వల్ల పెద్ద సినిమా అయింది.అంతే కాకుండా కంటెంట్ ఒక వర్గం వారికి చాలా బాగా కనెక్ట్‌ అవ్వడంతో సినిమా ను చాలా మంది చూశారు.

Telugu Adhah Sharma, Kerala Story, Tollywood, Top-Movie

సినిమా లో అదా శర్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి.ఇక ఈ సినిమా తో దక్కించుకున్న సక్సెస్ అదా శర్మ కు పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.ఇప్పటి వరకు కనీసం ఆమెను ఏ ఒక్క పెద్ద నిర్మాణ సంస్థ కూడా సంప్రదించిన దాఖలాలు కనిపించడం లేదు.ది కేరళ స్టోరీ సినిమా సమయంలో వచ్చిన ఆఫర్‌ తో ప్రస్తుతం అదా శర్మ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఈమెకు మళ్లీ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా ల్లో నటించాలనే ఆశ ఉందట.

Telugu Adhah Sharma, Kerala Story, Tollywood, Top-Movie

కానీ ఇప్పటి వరకు ఈమెకు ఆ ఆఫర్‌ లు కూడా రావడం లేదు.ముందు ముందు అయినా ఈ అమ్మడు మినిమం గ్యారెంటీ సినిమా ల్లో ఛాన్స్ దక్కించుకుంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అదా శర్మ తెలుగు లో హార్ట్ ఎటాక్ ( Heart attack )అనే సినిమా తో పరిచయం అయిన విషయం తెల్సిందే.

ఆ సినిమా నిరాశ పరిచినా కూడా చాలా సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంది.అదృష్టం కొద్ది ఏ లేడీ ఓరియంటెడ్‌ సినిమాకు దక్కని భారీ వసూళ్లు ఈమె సినిమాకు దక్కి రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది.

అయినా కూడా ఆఫర్ల విషయంలో ఎదురు చూపులు తప్పడం లేదు.ముందు ముందు అయినా ఆఫర్లు వరుసగా వస్తాయేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube