జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు లేడి కమెడియన్ వర్ష(Varsha) .ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉంటున్నారు.
ఇక ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.తరచూ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇక వర్ష త్వరలోనే బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో సందడి చేయబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
ఈమె కూడా తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని పరోక్షంగా తెలియజేశారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వర్ష తన కెరీర్ గురించి పలు విషయాలను తెలియచేశారు.తనకు సినిమాలలో నటించాలని ఉందని తెలిపారు.
అయితే హీరోయిన్గా మాత్రం కాకుండా అక్క ఫ్రెండ్ పాత్రలలో అవకాశాలు వస్తే చాలని ఈమె తెలియజేశారు.ఈ క్రమంలోనే యాంకర్ ప్రశ్నిస్తూ ఒకవేళ సినిమా అవకాశాలు వస్తే ఏ హీరో సినిమాలలో నటించాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వర్ష సమాధానం చెబుతూ.తనకి రామ్ చరణ్(Ramcharan) ఎన్టీఆర్(NTR) సినిమాలలో చెల్లెలి(Sister) పాత్రలో నటించాలని ఉందని తెలిపారు.ఇక లవర్ (Lover) గా కనుక నటించే అవకాశం వస్తే అది అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలో ఆయనకు లవర్ గా నటించే అవకాశం వస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా వర్ష చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి ఈమె అనుకున్న విధంగానే ఆ హీరోలు తనకు అవకాశం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.