టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎందుకు హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటించిన తాజా చిత్రం బ్రో.ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇందులో సాయి ధరమ్ తేజ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.అలాగే యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్( Priya Prakash Warrier ) కూడా కీలకపాత్రలో నటించింది.
ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతకు ఎదురు చూస్తున్నారు.ఇది ఇలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ఎమోషన్స్ నీ వేగవంతం చేశారు.ఇందులో భాగంగానే తాజాగా సినిమా దర్శకుడు సముద్రఖని( Director Samudrakhani ) మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ.పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు.

మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు.అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ ని మొదలు పెట్టాం.ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు.దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటి రోజే అర్థమైంది.సమయం వృథా చేయకూడదని సెట్‌లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు.షూటింగ్ జరిగినన్ని రోజులు ఆయన ఉపవాసం చేశారు.
ఎంతో నిష్ఠతో పనిచేశారు అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు సముద్రఖని.అలాగే ఈ సినిమాని 53 రోజుల్లోనే తొందరగా పూర్తి చేసినట్టు చెప్పుకొచ్చారు.







