గతంలో వర్గపోరు, ఆదిపత్యవిభేదాలతో సతమతమైన టి కాంగ్రేస్( Telangana Congress ) లో ప్రస్తుతం అలాంటి పరిస్థితి కొంతవరకు తగ్గిందనే చెప్పాలి.దీనికి కారణం ఆ మద్య కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించడం.
ఆ తరువాత నుంచి తెలంగాణలో కూడా నేతలంతా ఒకే తాటిపైకి వచ్చి విజయం కోసం అరతపడుతున్నారు.దీంతో పార్టీ కూడా మంచి ఊపు మీద కనిపిస్తోంది.
ఇతర పార్టీల నేతలు కూడా హస్తం పార్టీ వైపు ఆకర్షిస్తులౌతుండడంతో పార్టీ క్యాడర్ రెట్టించిన ఉత్సాహంలో ముందుకు సాగుతోంది.ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో కమిటీలను ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణపై ముమ్మర కసరత్తులు చేస్తోంది టి కాంగ్రేస్.
అందులో భాగంగానే ఇటీవల ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది హైకమాండ్.

ఈ కమిటీలో పార్టీలోని కొత్త పాత అని తేడా లేకుండా అందరికి ప్రదాన్యం కల్పించింది.ఎన్నికల కమిటీ చైర్మెన్ గా రేవంత్ రెడ్డిని నియమించగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,( Ponguleti Srinivas Reddy ) రేణుకా చౌదరి, వంటి వారికి కూడా పార్టీలో స్థానం కల్పించింది.అయితే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పొన్నం ప్రభాకర్ కు మాత్రం ఏ కమిటీలోను స్థానం దక్కలేదు.
దీంతో ఆయన పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.ఎన్నో ఏళ్లుగా పార్టీలో నిబద్దత కలిగిన వ్యక్తిగా ఉన్నానని, తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం భాద కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పొన్నం ప్రభాకర్ కు ఏ పదవి దక్కకపోవడంపై ఎవరి హస్తమైన ఉందా అనే అనుమానాలు పొన్నం వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై ఈ విషయంలో తాడో పేడే తేల్చుకునేందుకు పొన్నం రెడీ అయినట్లు తెలుస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా పొన్నం ప్రభాకర్ పార్టీలో యాక్టివ్ గా ఉండడంలేదు.కాంగ్రేస్ కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలలో కూడా పొన్నం పెద్దగా పాల్గొనడంలేదు.
దీంతో ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar )కు స్థానం కల్పించకుండా టి కాంగ్రేస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.అయితే పొన్నం తీరు చూస్తుంటే పార్టీపై తురుగుగళం విప్పేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అసలే దూకుడు మీదున్న కాంగ్రేస్ కు పొన్నం వ్యక్తిరేకగళం వినిపిస్తే.ఆ ప్రభావం పార్టీపై పడే అవకాశం ఉంది.
మరి పొన్నం విషయంలో కాంగ్రేస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.







