ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీ సరిహద్దులు దాటి మన సత్తాను నిరూపిస్తున్నాయి.ఒకప్పుడు మన బిజినెస్ చాలా తక్కువుగా ఉండేది.
అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో బడ్జెట్ లెక్కలు దాటి పోయాయి.అన్ని వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.
దీంతో బిజినెస్ కూడా వందల కోట్లలో జరుగుతుంది.ఇక ఓవర్సీస్ లో పరిస్థితి కూడా మారిపోయింది.
ఒకప్పుడు ఓవర్సీస్ బిజినెస్ చూసుకుంటే చాలా తక్కువుగా జరిగేది.కానీ ఇప్పుడు ఓవర్సీస్ కూడా కోట్ల బిజినెస్ జరుపు కుంటున్నాయి.
మన తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో గట్టి డిమాండ్ ఏర్పడింది.ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘ఓజి‘ ( OG Movie బిజినెస్ కూడా భారీగా జరిగింది.

టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగానే పూర్తి చేసుకుని ప్రజెంట్ శరవేగంగా షూట్ పూర్తి చేసుకుంటుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఓవర్సీస్ డీల్ కు సంబంధించిన క్రేజీ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాకు భీమ్లా నాయక్ కంటే డబుల్ రేంజ్ లో అక్కడ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

భీమ్లా నాయక్( Bheemla Nayak ) కు అప్పుడు 9 కోట్ల డీల్ జరిగితే ఇప్పుడు ఓజి సినిమాకు ఏకంగా 18 కోట్ల డీల్ పూర్తి అయినట్టు తాజాగా సమాచారం బయటకు వచ్చింది.ఈ సినిమాను ప్రముఖ డిస్టిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్టు టాక్.పవన్ నుండి డైరెక్ట్ సినిమా చాలా ఏళ్ల తర్వాత వస్తుండడంతో ఈ రేంజ్ లో డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







