షర్మిల ది వ్యూహాత్మక మౌనమేనా?

తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని అనేక ప్రయత్నాలు చేసిన వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు.గతం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వానికి వ్ వ్యతిరేఖం గా గళం విప్పిన షర్మిలా తెలంగాణ వ్యాప్తంగా భారీ పాదయాత్రలు చేశారు.

 Sharmila's Strategic Silence? , Ys Sharmila, Ts Politics , Ysr Telangana Part-TeluguStop.com

ఎన్నికల కు చాలా ముందుగానే చాలా హడావిడి చేసిన ఆమే ఇప్పుడు ఎన్నికలకు దగ్గరకు వచ్చిన వేళ ఏ విదమైన స్పందన లేకుండా మౌనంగా ఉండటం పలు ఊహగానాలకు తావిస్తుంది .ఆమె పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని లేదు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందని లేదా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్సారధ్య బాధ్యతలు స్వీకరిస్తుందని ఇలా పలు విధాలుగా ఆమె రాజకీయ ప్రయాణం పై విశ్లేషణలు వచ్చిన విషయం విధితమే.అయితే తన తండ్రి జయంతి సందర్భంగా తెలంగాణలోని పాలేరు నుంచే పోటీ చేస్తానని ఆమె స్పష్టంగా ప్రకటించడంతో ఆమె తెలంగాణ రాజకీయాల పైనే ఆసక్తితో ఉన్నారని తెలుస్తుంది.

Telugu Congress, Dk Shivakumar, Ramachandra Rao, Revanth Reddy, Ts, Ys Sharmila,

అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy) ఆమె తెలంగాణ రాజకీయ ప్రయాణాన్ని బలంగా వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే రేవంత్ తో సంబంధం లేకుండా అధిష్టానంతో టచ్ లోకి వెళ్లిన షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన హామీ కోసం పట్టుపడుతున్నట్లుగా సమాచారం.ఇప్పటికే కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే సుకుమార్( DK Shivakumar ) ను పలుమార్లు కలిసిన షర్మిల ఈ దిశగా కీలక మంత్రాగం చేసినట్లు సమాచారం.కెవిపి రామచంద్ర రావు( K.V.P.Ramachandra Rao ) కూడా షర్మిల కాంగ్రెస్ ప్రయాణానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారట.

Telugu Congress, Dk Shivakumar, Ramachandra Rao, Revanth Reddy, Ts, Ys Sharmila,

తాను చెప్పాల్సిందంతా అధిష్టానానికి చెప్పేసిన షర్మిల ఇక నిర్ణయం అధిష్టానానికి వదిలిపెట్టి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని తెలుస్తుంది .కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత షర్మిలకు ఫోన్ చేస్తారని, అప్పుడు తిరిగి యాక్టివే ట్ అయ్యే ఉద్దేశంతో తాత్కాలిక మౌనం పాటిస్తున్నారట.ఎన్నికలకు దగ్గరలో ఉన్నందున మరికొద్ది రోజుల్లో తమ రాజకీయ ప్రయాణంపై షర్మిల స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube