కెసిఆర్ కు అసంతృప్తుల డెడ్ లైన్?

ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో పొలిటికల్ ఆశవహుల హడావుడి తారా స్థాయికి చేరుతుంది.టికెట్లు కేటాయింపు పై( BRS Tickets ) స్పష్టతనివ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు.

 Rebal Leaders Set Deadline For Kcr Details, Cm Kcr, Brs Party Tickets, Telangana-TeluguStop.com

ఈ హడావుడి అన్ని పార్టీలలోనూ ఉన్నప్పటికీ అధికార బారాసాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో రెండవసారి ఎన్నికలలో గెలిచిన తర్వాత దాదాపు అన్ని పార్టీలలోని ప్రధాన అభ్యర్థులను తమ పార్టీలో కలిపేసుకున్న బారాస ఇప్పుడు దానికి మూల్యం చెల్లిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

అనేక ఆశలు చూపించే పార్టీలో కలుపుకున్నప్పటికీ పరిమితమైన ప్రబుత్వ పదవులతో ఎక్కువ మందిని బారాస సంతృప్తి పరచలేకపోయింది.

అయినప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో విపక్షాలు కొంత కాలం క్రితం వరకూ అంత యాక్టివ్గా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భరాస లోనే కొనసాగిన అసంతృప్తి నేతలకు ఇప్పుడు కాంగ్రెస్( Congress Party ) మంచి ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అతివేగం తో పుంజుకోవడంతో ఇప్పుడు బారాస లోని అసంతృప్తి నేతలకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది .జిల్లాల వారీగా అసంతృప్త నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుని మరీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి.ఈ నెలాఖరు వరకు టికెట్టుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుంటామని అధిష్టానానికి ఇప్పటికే డెడ్లైన్ కూడా ఈ నేతలు విధించారట.

Telugu Bjp, Brs Tickets, Brs Rebal, Cm Kcr, Congress, Tickets, Telangana-Telugu

అసంతృప్తి నేతలు తిరుగుబాటు చేస్తారనే ఉద్దేశంతోనే సీట్ల టికెట్లు కేటాయింపును వాయిదా వేస్తూ వస్తున్న కేసీఆర్ పై ( CM KCR ) ఈ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు కాబట్టి అధిష్టానం వద్ద ఒక క్లారిటీ తెచ్చుకుంటే భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ను నిర్మించుకోవచ్చు అని వీరు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఒక్క సారి బరాశా టికెట్లు కేటాయింపు ఫైనలైతే కాంగ్రెస్ భాజాపా ల లోకి భారీ ఎత్తున వలసలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Telugu Bjp, Brs Tickets, Brs Rebal, Cm Kcr, Congress, Tickets, Telangana-Telugu

రెండుసార్లు పాలించడం వల్ల వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత కు తోడు ఈ కీలక నేతలు పార్టీ మారితే పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని భావిస్తున్న కేసీఆర్ఏదో విధంగా వారిని సంతృప్తి పరచి పార్టీలో కొనసాగేలాచేయడానికి కి బుజ్జగింపులు షురూ చేశారట .అయినప్పటికీ పరిస్థితులు ఏమీ సద్దుమనగలేదని లేదని నివురు గప్పిన నిప్పులా ప్రస్తుతం వాతావరణం ఉందని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube