ఏపీలో 2024 ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉండగా ఎన్నికలకు సంబంధించిన కథలతో ఎక్కువగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.మహి వి రాఘవ్ యాత్ర సినిమాతో బిజీగా ఉండగా రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) వ్యూహం, వ్యూహం2 సినిమాలతో బిజీగా ఉన్నారు.
అయితే ఈ సినిమాలకు పోటీగా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి2 సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాకు టీవీ5 మూర్తి డైరెక్టర్ కావడం గమనార్హం.

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM YS jagan ) ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది.2024 సంవత్సరం జనవరి నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.నారా రోహిత్ టీడీపీ మనిషి కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రతినిధి సినిమాకు, ప్రతినిధి2 సినిమాకు ఎలాంటి పోలిక ఉండదని తెలుస్తోంది.

నారా రోహిత్( Nara rohith ) రీఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.దర్శకుడు టీవీ5 మూర్తి కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటారు.వైసీపీ వల్ల మూర్తి కొన్ని ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నారు.టీవీ5 మూర్తికి దర్శకునిగా ఎలాంటి అనుభవంలేకపోయినా ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమాతో ఏ పార్టీని టార్గెట్ చేయడం లేదని చెబుతోంది.ఇప్పటికే విడుదలైన ప్రతినిధి2 పోస్టర్ కు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రతినిధి2 సినిమా కోసం నారా రోహిత్ తన లుక్ ను సైతం మార్చుకుంటున్నారని తెలుస్తోంది.నారా రోహిత్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నారా రోహిత్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారని సమాచారం అందుతోంది.నారా రోహిత్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.







