మంగళవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ( BJP ) తలపెట్టాలని అనుకున్న ధర్నా వాయిదా పడింది.విస్తారంగా వర్షం కురుస్తూ ఉండటంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్పష్టం చేయడం జరిగింది.
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించడంతో ముందుగానే ఈ ధర్నా కార్యక్రమాన్ని బీజేపీ వాయిదా వేసుకోవటం జరిగింది.కాగా ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు హైకోర్టు( High Court)ను ఆశ్రయించారు.
ఈ క్రమంలో న్యాయస్థానం ఎందుకు ధర్నాకు అనుమతి ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించింది.
సచివాలయ ముట్టడించే అవకాశం ఉన్నందుకు సభకు అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
ఇక ఇదే సమయంలో ఇతర పార్టీలకు అనుమతి ఇచ్చి బీజేపీకి ఇవ్వకపోవడం పట్ల ప్రశ్నల వర్షం కురిపించింది.అయితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వా న్యాయవాది అనటంతో.
ధర్నాలో 500 మందికి మించి పాల్గొనరాదని ఈ మేరకు పోలీసులకు పలికితే పూర్వక హామీ ఇవ్వాలని బీజేపీకి హైకోర్టు సూచించింది.అంతేకాదు ఎటువంటి ర్యాలీలు నిర్వహించవద్దని ధర్నాకు హాజరయ్యే ముఖ్య నేతలు వివరాలు.
పోలీసులకు ముందుగానే సమర్పించాలని పేర్కొంది.ఈ మేరకు బీజేపీ ధర్నాకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సీపీ( Hyderabad CP )ని ఆదేశించడం జరిగింది.







